అల్లు అర్జున్ కెరీర్లో ది బెస్ట్ గా నిలవనున్న ‘గోనగన్నా రెడ్డి’

అల్లు అర్జున్ కెరీర్లో ది బెస్ట్ గా నిలవనున్న ‘గోనగన్నా రెడ్డి’

Published on Jul 30, 2014 4:30 PM IST

allu-arjun-as-gona-gana-red

‘రేసు గుర్రం’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలి కానీ అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ సినిమాలో గోనగన్నా రెడ్డి పాత్ర చేయడానికి కమిట్ అవ్వడం వలన త్రివిక్రమ్ సినిమాని కాస్త వాయిదా వేసారు.

గోనగన్నా రెడ్డి పాత్ర కోసం అల్లు అర్జున్ కొద్ది రోజులు స్పెషల్ ట్రైనింగ్ తీసుకోవడమే కాకుండా, స్పెషల్ లుక్ లో కూడా కనిపించనున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రుద్రమదేవి’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అల్లు అర్జున్ సన్నిహితులు చెప్తున్న సమాచారం ప్రకారం గోనగన్నా రెడ్డి పాత్రలో అల్లు అర్జున్ చాలా బాగున్నాడు. అలాగే గోనగన్నా రెడ్డి పాత్ర అల్లు అర్జున్ కెరీర్లోనే వన్ అఫ్ ది బెస్ట్ అవుతుందని అంటున్నారు.

గోనగన్నా రెడ్డికి భార్య పాత్రలో కేథరిన్ ట్రేస కనిపించనుంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘రుద్రమదేవి’ సినిమాలో అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు