కళ్యాణ్ రామ్ నటనకు ప్రసంశల వర్షం !

కళ్యాణ్ రామ్ నటనకు ప్రసంశల వర్షం !

Published on Oct 21, 2016 11:33 AM IST

kalyan-ram-m
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పూరి డైరెక్షన్లో చేసిన చిత్రం ‘ఇజం’ ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కోసం కళ్యాణ్ రామ్ కష్టపడి తన లుక్ ను మొట్ట మార్చుకుని కొత్తగా కనిపించాడు. సినిమాలో అతని నటన ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే కోర్ట్ సన్నివేశంలో అయితే కళ్యాణ్ రామ్ నటన చాలా బాగుంది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు, విమర్శకులు కళ్యాణ్ రామ్ నటనకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా కళ్యాణ్ రామ్ ను కొత్తగా చూపించాలనే ప్రయత్నంలో ఓ మంచి పాత్రను, కథను రాసి సినిమా తీశారు. దీంతో కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని కళ్యాణ్ రామ్ కు మంచి ఫీడ్ బ్యాక్ తో పాటు సినిమా విజయంపై నమ్మకం కూడా పెరిగింది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిమించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు