మంచి ధర పలికిన ‘సువర్ణ సుందరి’ శాటిలైట్ హక్కులు !

మంచి ధర పలికిన ‘సువర్ణ సుందరి’ శాటిలైట్ హక్కులు !

Published on Nov 20, 2017 4:19 PM IST

ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథాంశాలతో రూపొందిన సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. అందుకే కొత్త వాళ్ళు సరికొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తున్నారు. అలాంటి భిన్నమైన కోవకు చెందినదే ‘సువర్ణ సుందరి’ చిత్రం. చరిత్ర ఎప్పుడూ భవిష్యత్తును వెంటాడుతూనే ఉంటుంది అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ తో ఆకట్టుకుని పాజిటివ్ క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది.

విఎఫ్ఎక్స్ ప్రధాన బలంగా రూపొందిన ఈ చిత్రంలో జయప్రద, సాక్షి చౌదరి, పూర్ణాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క హిందీ శాటిలైట్ హక్కులు సుమారు కోటి రూపాయలకు అమ్ముడైన్నట్లు సమాచారం. ఒక రకంగా చెప్పాలంటే ఈ డీల్ నిర్మాతలకు లాభదాయకమైనదనే చెప్పాలి. సూర్య ఎం. ఎస్.ఎన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎం.ఎల్ లక్ష్మి నిర్మించారు . త్వరలోనే సినిమా యొక్క విడుదల తేదీని ప్రకరటించనున్నారు నిర్మాతలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు