విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ సినిమా !

విడుదలకు ముందే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ సినిమా !

Published on Apr 26, 2018 5:28 PM IST

మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తో భారీ విజయాన్ని సొంతం చేసుకుని అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రస్తుతం తన రెండో సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా పేరే ‘ఈ నగరానికి ఏమైంది’. పేరులోనే ఒకింత కొత్త రకం హాస్యాన్ని ధ్వనిస్తున్న ఈ చిత్రం థియేటర్లలో చూస్తే ఇంకా కొత్తగా అనిపిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇప్పటికే సినిమాను కొందరికి ప్రత్యేకంగా షో వేయడం జరిగింది. షో చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని, తరుణ్ భాస్కర్ మరోసారి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడని, ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ తెలుగు సినిమాలో ఇంతవరకు చూడలేదు వంటి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. అంతేగాక టైటిల్ పోస్టర్ పై కూడ మీ గ్యాంగ్ తో రా థియేటర్ కి, చూస్కుందాం’ అనే క్యాప్షన్ పెట్టి మరింత ఆసక్తిని క్రియేట్ చేశాడు తరుణ్.

ఈ చిత్రాన్ని కూడ ‘పెళ్లి చూపులు’ను సమర్పించిన సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ మరియు అనిషాలు ప్రధాన పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు