అదిరిపోయే లొకేషన్స్‌లో ‘ఖైదీ నెం. 150’ షూట్!

khaidi150

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం. 150’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. చాలాకాలం తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తోండడం, ఆయనకిది 150వ సినిమా కావడం లాంటి అంశాలతో ఖైదీ నెం. 150 మొదట్నుంచీ విపరీతమైన ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. అందుకు తగ్గట్టే నిర్మాత రామ్ చరణ్ కూడా ఎక్కడా తగ్గకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఈమధ్యే క్లైమాక్స్ ఫైట్ పూర్తి చేసిన టీమ్, తాజాగా పాటల షూట్ కోసం యూరప్ వెళ్ళింది.

ప్రస్తుతం క్రోటియా దేశంలోని పలు అద్భుతమైన లొకేషన్స్‌లో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. చిరంజీవి, కాజల్‌లపై ఈ పాటలను చిత్రీకరిస్తున్నారు. అభిమానులకు చిరు స్థాయి డ్యాన్సులను మళ్ళీ పరిచయం చేయనున్న ఈ సినిమాకు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన కత్తికి రీమేక్ అయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Like us on Facebook