రవితేజ పెర్ఫార్మెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది !

రవితేజ పెర్ఫార్మెన్స్ కు రెస్పాన్స్ అదిరిపోతోంది !

Published on Oct 18, 2017 5:14 PM IST

మాస్ మహారాజ రవితేజ చాన్నాళ్ల తర్వాత ఈరోజే థియేటర్లలో సందడి చేయడం మొదలుపెట్టాడు. ఆయన నటించిన తాజా చిత్రం ‘రాజా ది గ్రేట్’ ఈరోజే విడుదలైంది. మార్కింగ్ షో నుండే సినిమా చూసిన ప్రేక్షకులు రవితేజ పెర్ఫార్మెన్స్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో అంధుడిగా నటించిన రవితేజ చాలా ఖచ్చితత్వంతో నటించి, తనదైన మాసీ స్టైల్లో ఎంటర్టైన్మెంట్ ను అందించారు.

ఆయన కనిపించిన ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. గ్యాప్ తీసుకున్నా కూడా రవితేజ ఎంటర్టైనింగ్ సినిమాతో మాస్ మహారాజ ఈజ్ బ్యాక్ అనేలా చేశారని రవితేజ అభిమానులు సంబరపడుతున్నారు. అన్ని ఏరియాల నుండి సినిమాకు మంచి స్పందనే లభిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు