రాజమౌళికే తెలియని ఆ ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎవరు?

రాజమౌళికే తెలియని ఆ ఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎవరు?

Published on Feb 23, 2020 7:27 PM IST

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే.. దర్శకత్వం స్థానంలో రాజమౌళి పేరుతో పాటు సంజయ్‌ పాటిల్‌ అనే మరో వ్యక్తి పేరు కూడా కనిపిస్తోంది. ఆసక్తిగా అసలు ఈ సంజయ్‌పాటిల్‌ ఎవరని సెర్చ్‌ చేస్తే ఎలాంటి సమాచారం చూపించడం లేదు. ఇది చూసిన అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. కొందరైతే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ దర్శకత్వంలో సహాయంగా మరో దర్శకుడిని తీసుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళికే తెలియని ఆ సంజయ్ పాటిల్ ఎవరో గూగుల్ కే తెలియాలి.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమరంభీమ్‌గా నటిస్తుండగా, ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు