నైజాంలో 10 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘గోపాల గోపాల’

నైజాంలో 10 కోట్ల మార్క్ క్రాస్ చేసిన ‘గోపాల గోపాల’

Published on Jan 29, 2015 12:00 PM IST

gopala-gopala-audio
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన టాలీవుడ్ క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ పబ్లిక్ టాక్ తో కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ప్రతి ఏరియాలోనూ డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు తెచ్చిపెట్టె రీతిలో ఈ సినిమా కలెక్షన్స్ ఉన్నాయి.

మాకు అందిన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా నైజాంలో 10 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా నైజాంలో ఓవరాల్ గా 10.1కోట్ల షేర్ సాధించింది. పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో సరికొత్తగా కనిపించడం మరియు వెంకీ – పవన్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకోవడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. కిషోర్ కుమార్ పర్ధసాని డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు