‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ కూడా ‘ఓ మై గాడ్’ కి స్పూర్తేనా.?

‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ కూడా ‘ఓ మై గాడ్’ కి స్పూర్తేనా.?

Published on Nov 27, 2014 11:33 AM IST

gopala-gopala
బాలీవుడ్ లో హిట్ అయిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా తెలుగులో రానున్న చిత్రమే ‘గోపాల గోపాల’. ఇందులో ఎలాంటి దాపరికమూ లేదు, అక్కడ అక్షయ్ కుమార్ – పరేష్ రావాల్ కలిసి నటించగా ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించారు. ప్రస్తుతం అందరూ నవంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మాకు అందిన సమాచారం ప్రకారం గోపాల గోపాల ఫస్ట్ లుక్ కూడా ఓ మై గాడ్ సినిమాని తలపించేలా ఉంటుందని అంటున్నారు. దీని ప్రకారం ఫస్ట్ లుక్ పోస్టర్ లో మనకు సింపుల్ గా కనిపించే పవన్ కళ్యాణ్, వెంకటేష్ లు ఉండే అవకాశం ఉంది. కిషోర్ పార్ధసాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా శ్రియ నటించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు