‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్.?

‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్.?

Published on Nov 23, 2014 6:06 PM IST

gopala-gopala
టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ మూవీ ‘గోపాల గోపాల’. బాలీవుడ్ సూపర్ హిట్ హిందీ మూవీ ‘ఓ మై గాడ్’ కి ఇది రీమేక్. ముందుగా అనుకున్నట్టు ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం శరవేగంగా షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. అభిమానులంతా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అని ఎంత ఎదురు చూస్తున్నారో అంత కన్నా ఎక్కువగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రసతుతం ఫిలిం నగర్లో ఈ చిత్రానికి సంబందించిన వారు చెబుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 28న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన ఎబి కోర్ డిజైన్స్ వారు గత కొద్ది రోజులుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ ని డిజైన్ చేసే పనిలో ఉన్నారు. ఇంకా మిగిలి ఉన్న 20 రోజుల షూటింగ్ ని ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవంతం చేయనున్నారు.

కిషోర్ కుమార్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించనున్న ఈ సినిమా సంక్రాంతికే వస్తుందని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు