ప్రస్తుతం సెట్స్ పై ఉన్న టాలీవుడ్ మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గోపాల గోపాల’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని నవంబర్ 28న రిలీజ్ చెయ్యడానికి రంగం సిద్దం చేసారు. మాకు అందిన సమాచారం ప్రకారం ఇండస్ట్రీలో ఇన్నర్ గా గోపాల గోపాల ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
అసలు విషయంలోకి ఇప్పటికే గోపాల గోపాల చిత్ర టీం ఫస్ట్ లుక్ ని ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని చూపించారు. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని, పవన్ – వెంకీలను బాగా డిజైన్ చేసారని అంటున్నారు. ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముందే ప్రముఖుల నుంచి ఫస్ట్ లుక్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుండడంతో ఫస్ట్ లుక్ పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.
మరి అందరు సెలబ్రిటీస్ సూపర్బ్ అని చెబుతున్న అంచనాలను అందుకునేలా గోపాల గోపాల ఫస్ట్ లుక్ ఉంటుందా.? లేదా.? అనేదాని కోసం మరో మూడు రోజులు వేచి చూడాల్సిందే.. కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున ఈ సినిమాని డి. సురేష్ బాబు – శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు.