సమ్మర్‌కు రెడీ అవుతోన్న మాస్ హీరో సినిమా!

సమ్మర్‌కు రెడీ అవుతోన్న మాస్ హీరో సినిమా!

Published on Jan 17, 2017 2:31 PM IST

Gopichand
మాస్, యాక్షన్ సినిమాలతో మెప్పించే గోపీచంద్ హీరోగా నటిస్తోన్న మూడు సినిమాలు ఇప్పుడు సెట్స్‌పై ఉన్నాయి. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఓ సినిమా, బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా, ‘ఆక్సీజన్’ అనే మరో సినిమా.. ఇలా మూడూ ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇందులో ఆక్సీజన్ వేసవి సీజన్‌కు ముందే వస్తుందన్న ప్రచారం జరుగుతుంది కానీ, ఇంకా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. అయితే సంపత్ నంది సినిమా మాత్రం సమ్మర్ సీజన్‌కు ఫిక్స్ అయిపోయిందట.

ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటినుంచి నాలుగో షెడ్యూల్‌లోకి అడుగుపెట్టింది. ఈ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తి కానుందని తెలుస్తోంది. దీంతో సమ్మర్‌లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. గత కొద్దికాలంగా ఓ బలమైన హిట్ కోసం ఎదురుచూస్తోన్న గోపీచంద్ ఆక్సీజన్‌తో పాటు ఈ సినిమాపైనా భారీ ఆశలే పెట్టుకున్నారు. సంపత్ నంది గత చిత్రాల స్టైల్లోనే కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు