గోపీచంద్-సంపత్ నంది సినిమా సెట్స్‌పైకెళ్ళింది!
Published on Sep 27, 2016 8:50 pm IST

sampath-nandi
‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’, బెంగాల్ టైగర్ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంపత్ నంది, తాజాగా హీరో గోపీచంద్‍తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న టీమ్ నేడు సెట్స్‌పైకి వెళ్ళింది. ఫస్ట్ షెడ్యూల్ థాయ్‌లాండ్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలతో జరగనుంది. ఇక గోపీచంద్ లాంటి సింపుల్‌గా ఉండే స్టార్ హీరోతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని సంపత్ నంది ఈ సందర్భంగా అన్నారు.

తన గత చిత్రాల స్టైల్లోనే కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ సినిమా తెరకెక్కనుందని సంపత్ తెలిపారు. భగవాన్, జె.పుల్లారావు నిర్మించనున్న ఈ సినిమాలో గోపీచంద్ ఓ సరికొత్త పాత్రలో కనిపించనున్నారని సమాచారం. గోపీచంద్ సరసన హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Like us on Facebook