‘సాహసం’ రైటర్ తో గోపీచంద్ మూవీ?

‘సాహసం’ రైటర్ తో గోపీచంద్ మూవీ?

Published on Apr 20, 2014 6:55 PM IST

gopi-chand
‘సాహసం’ సినిమాతో హిట్ అందుకొని ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న గోపీచంద్ త్వరలో రాధాకృష్ణ కుమార్ తో ఓ సినిమా చేయనున్నాడు. రాధాకృష్ణ కుమార్ గోపీచంద్ నటించిన ‘సాహసం’ సినిమాకి డైలాగ్స్ అందించాడు.

తాజాగా గోపీచంద్ రాధాకృష్ణ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. గోపీచంద్ ప్రస్తుతం శ్రీ వాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. రాకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ఆనంద్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కోనా వెంకట్ – గోపి మోహన్ కలిసి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు