విడుదల తేదీని ఖాయం చేసుకున్న గోపిచంద్ చిత్రం !
Published on Jul 9, 2017 9:59 am IST


హీరో గోపిచంద్ చేస్తున్న వరుస సినిమాల్లో ‘ఆక్సిజన్’ కూడా ఒకటి. ప్రముఖ నిర్మాత ఏ.ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనుంది. కొన్ని నెలల క్రితమే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటంతో కాస్త ఆలస్యంగా రిలీజవుతోంది.

ఈ ఆగష్టు 18 వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ సాయి రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.ఐశ్వర్య నిర్మించిన ఈ చిత్రంలో సుమారు 90 నిముషాల పాటు సాగే విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల్ని అలరిస్తాయని టీమ్ చెబుతోంది.

 
Like us on Facebook