శ్రీధర్ సీపాన డైరెక్షన్లో బ్రహ్మానందం కొడుకు గౌతమ్

శ్రీధర్ సీపాన డైరెక్షన్లో బ్రహ్మానందం కొడుకు గౌతమ్

Published on Jul 24, 2014 2:14 PM IST

sridar

‘వస్తాడు నారాజు’, ‘ఆహనా పెళ్ళంట’, ‘నిప్పు’, ‘పూల రంగడు’, ‘పోటుగాడు’, ‘భీమవరం బుల్లోడు’ సినిమాలకు డైలాగ్స్ రాసి పేరు తెచ్చుకున్న డైలాగ్ రైటర్ శ్రీద సీపాన. ప్రస్తుతం ‘పవర్’, ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేస్తున్నాడు. ఇన్ని రోజులు డైలాగ్ రైటర్ గా పనిచేసిన శ్రీధర్ సీపాన చాలా మంది రైటర్స్ లానే డైరెక్టర్ గా మారనున్నాడు. తన మొదటి సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నాడు.

మాకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం శ్రీధర్ సీపాన డైరెక్ట్ చేయనున్న మొదటి సినిమాలో బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ హీరోగా నటించనున్నాడు. అలాగే ఈ సినిమాని ‘రారా కృష్ణయ్య’ తీసిన వంశీకృష్ణ శ్రీనివాస్ ఎస్.వి.కె సినిమా బ్యానర్ పై నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన చేసి ఈ సంవత్సరంలోనే ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నారు.

ఇన్ని రోజులు డైలాగ్ రైటర్ గా ఆకట్టుకున్న శ్రీధర్ సీపాన డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంటాడా.? గౌతమ్ కి హిట్ ఇస్తాడా? అనేదాని కోసం మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు