బాలయ్య సినిమాకు ఏపీలోనూ ట్యాక్స్ మినహాయింపు!

gpsk
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వందో సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక తెలుగు జాతికి చెందిన శాతకర్ణి జీవిత కథతో తెరకెక్కిన సినిమా కావడం వల్ల, ఈ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు కోసం టీమ్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరింది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి ట్యాక్స్ మినహాయింపు చేయగా, నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా ట్యాక్స్ మినహాయింపును ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లను 75శాతానికి మించకుండా చూడాలని ఆదేశించింది. వేరే ఇతర సినిమాలతో కలిపి గౌతమిపుత్ర శాతకర్ణిని ప్రదర్శించకూడదని కూడా నిబంధన విధించింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది.

gpsk-ap

 

Like us on Facebook