చరణ్ కు దొరికిన సక్సెస్ బాలయ్యకు కూడా దొరుకుతుందా !

చరణ్ కు దొరికిన సక్సెస్ బాలయ్యకు కూడా దొరుకుతుందా !

Published on Jan 17, 2017 10:18 PM IST

balakrishna
బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కేవలం ఏపీ, తెలంగాణల్లోనే కాక ఓవర్సీస్ లో సైతం రికార్డ్ కలెక్షన్లు రాబడుతోంది. ఈ సినిమాకి వచ్చినన్ని కెలెక్షన్లు గతంలో బాలయ్య సినిమాల్లో మరే చిత్రానికీ రాలేదు. ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ కలెక్షన్లు కీలకమైపోవడంతో బాలయ్య అండ్ టీమ్ ఓవర్సీస్ పై మరింత దృష్టి పెట్టాలని భావించి గురువారం నుండి వరుసగా మూడు రోజుల పాటు భారీ టూర్ ప్లాన్ చేశారు. ఈ టూర్ తో ఇప్పటికే $1.3 మిలియన్ వసూళ్లు సాదించిన ఈ చిత్రం 1.5 మిలియన్ కు సులభంగా వెళ్ళిపోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గతంలో కూడా రామ్ చరణ్ తన చిత్రం ‘ధృవ’ విషయంలో ఎలాగైనా మిలియన్ డాలర్ మార్క్ అందుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రీమియర్స్ నుండే టూర్ మొదలుపెట్టి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ సులభంగా మిలియన్ డాలర్ మార్క్ అందుకున్నాడు. ఇప్పుడు అదే ఫార్ములను రిపీట్ చేయనున్న బాలయ్య చరణ్ లాగే తన శాతకర్ణి సినిమా మైలేజ్ ను ఎంత వరకు పెంచుతాడో చూడాలి. ఈ టూర్లో బాలయ్యతో పాటు దర్శకుడు క్రిష్, హీరోయిన్ శ్రియ శరన్ కూడా పాల్గొంటోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు