రూ. 40 కోట్ల మార్కును చేరుకున్న శాతకర్ణి !

రూ. 40 కోట్ల మార్కును చేరుకున్న శాతకర్ణి !

Published on Jan 19, 2017 4:19 PM IST

GPSK
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ జనవరి 12న విడుదలై బ్రహ్మాండమైన విజయం దిశగా దూసుకుపోతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ చిత్రం తెలుగు జాతి గర్వించేలా ఉందని అభిమానులు, ప్రేక్షకులు బాలకృష్ణను, దర్శకుడు క్రిష్ ను ఆకాశానికెత్తేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి వారం కలెక్షన్ల వివరాలు చూస్తే రికార్డ్ స్థాయిలో ఉన్నాయి.

నైజాం ఏరియాలో రూ 7 కోట్లు, సీడెడ్ లో రూ. 6 కోట్లు, వైజాగ్ లో రూ. 4 కోట్లు కలిపి మొత్తం ఎపి, తెలంగాణాల్లో ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో $1.5 మిలియన్ మార్కుకు అతి చేరువలో ఉన్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 40 కోట్లకు పైగానే షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ కలెక్షన్లు బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక వసూళ్లుగా నిలిచాయి. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య యూఎస్ టూర్లో ఉండటం వలన ఈ కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు