గ్రాండ్ గా హలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

గ్రాండ్ గా హలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ !

Published on Dec 18, 2017 6:46 PM IST

అఖిల్ నటించిన హలో సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం అమెరికాలో ప్రమోషన్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 15, 16, 17 తేదీల్లో న్యూజెర్సీ, డల్లాస్‌, శాన్‌జోసేల్లో హలో యూనిట్ పర్యటించింది. ఈ పర్యటనలో డాన్స్‌లు చేస్తూ, పాటలు కూడా పాడనున్నాడు అఖిల్.

తాజా సమాచారం ప్రకారం ఈ నెల 20 న హైదరాబాద్ లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యబోతున్నారు. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాలో రమ్య కృష్ణ, జగపతి బాబు ప్రదాన పాత్రల్లో కనిపించబోతున్నారు. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కల్యాణి హీరొయిన్ గా పరిచయం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు