మారుతి ద్వారా ఫస్ట్ మూవీ ఛాన్స్ వచ్చిందన్న ‘గల్ఫ్’ హీరో !


వలస భాదితుల కష్టాల నేపథ్యంలో రూపొందిన గల్ఫ్ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ చిత్ర హీరో చేతన్ గల్ఫ్ విశేషాలతో పాటు సినీ పరిశ్రమలో అవకాశం దక్కించుకున్న విషయాలని కూడా వెల్లడించారు. వైజాగ్ లోనే ఉన్నత విద్యని అభ్యసించిన చేతన్ ఆ తరువాత సినీ గురువు సత్యానంద్ వద్ద చేరాడు. ఆయన వద్ద శిక్షణ పొందుతున్న సమయంలో ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా దర్శకుడు మారుతి ద్వారా ‘రోజులు మారాయి’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కాగా రేపు విడుదలకు సిద్ధం అవుతోన్న గల్ఫ్ చిత్రంలో అన్ని అంశాలు ఉంటాయని చేతన్ చెప్పారు. కమర్షియల్ చిత్రంలో లాగే పాటలు, ఫైట్స్ తో పాటు ఓ ఐటమ్ సాంగ్ కూడా ఉన్నట్లు తెలిపారు. వీటన్నింటితో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న ఎమోషనల్ క్యారెక్టర్ లో నటించే అవకావం వచ్చిందని చేతన్ తెలిపారు.

దర్శకుడు మారుతి నిర్మాణంలో తన తదుపరి చిత్రం ఉండబోతోందని చేతన్ తెలిపాడు. కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన ఫస్ట్ ర్యాంక్ రాజు అనే రీమేక్ చిత్రంలో నటించనున్నట్లు తెలిపారు. కన్నడలో దర్శకత్వం వహించిన నరేష్ కుమారే రీమేక్ ని కూడా తెరకెక్కిస్తారని తెలిపారు. త్వరలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

 

Like us on Facebook