ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : డింపుల్ హయాతి – ‘గల్ఫ్’ ద్వారా నాకు మంచి నటి అనే గుర్తింపు వస్తుంది!

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : డింపుల్ హయాతి – ‘గల్ఫ్’ ద్వారా నాకు మంచి నటి అనే గుర్తింపు వస్తుంది!

Published on Oct 12, 2017 3:43 PM IST

‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, ఒక క్రిమినల్ ప్రేమ కథ’ వంటి సినిమాల్ని చేసిన దర్శకుడు సునీల్ రెడ్డి డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘గల్ఫ్’ రేపు విడుదలకానుంది. ఈ సినిమాతో డింపుల్ హయాతి హీరోయిన్ గా పరిచయం కానుంది. చిత్ర విడుదల సందర్బంగా ఆమె 123తెలుగులో ముచ్చటించారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) ఈ సినిమా ఆఫర్ మీకెలా వచ్చింది ?
జ) నాకు చిన్నప్పటి నుండి నటి అవ్వాలని ఉండేది. ఇంట్లో వాళ్ళు కూడా నన్ను సపోర్ట్ చేశారు. నేను ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో డైరెక్టర్ సునీల్ రెడ్డిగారు ఆడిషన్ కు పిలిచారు. అలా ఫస్ట్ ఆడిషన్ లోనే సినిమా ఒకే అయింది.

ప్ర) ప్రస్తుతం చదువును కొనసాగిస్తున్నారు ?
జ) అవును. ఇప్పుడు బి.ఎస్సి సెకండియర్ చదువుతున్నాను. సినిమాలతో పాటే చదువును కూడా కంటిన్యూ చేస్తాను.

ప్ర) మీ కుటుంబ నైపథ్యం ఏమిటి ?
జ) నాన్నకు వ్యాపారాలున్నాయి. నేను చిన్నప్పటి నుండి హైదరాబాద్లోనే తాతయ్య వాళ్ళ దగ్గర ఉంది చదువుకున్నాను. నా బాల్యం, చదువు అంతా ఇక్కడే గడిచింది.

ప్ర) ఈ సినిమా కోసం గల్ఫ్ వెళ్లారు కదా అక్కడి అనుభవాలు చెప్పండి ?
జ) గల్ఫ్ లో 15 రోజుల పాటు షూట్ చేశాం. అన్ని అరబ్ కంట్రీస్ లోను షూటింగ్ జరిపాం. మొదటి అక్కడకు వెళ్ళగానే రిచ్ లైఫ్ ఎలా ఉంటుందో చూసి ఆ తర్వాత కష్టల్లో ఉన్న భారతీయులను చూస్తే మనసు కదిలిపోయింది.

ప్ర) ఈ సినిమా ద్వారా మీరు తెలుసుకుందేమిటి ?
జ) మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది ఎలాంటి అవగాహన లేకుండా పని కోసం అక్కడకు వెళ్లి నానా కష్టాలు పడుతున్నారు. కుటుంబాలకు దూరంగా వాళ్ళు పడుతున్న బాధలు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఆడవాళ్లు కూడా ఎన్నో బాధలు పడుతున్నారు. అలాంటి వారి పట్ల ప్రభుత్వం శ్రద్ద చూపాల్సిన అవసరం ఉంది అనిపించింది.

ప్ర) కష్టాలు పడుతున్న భారతీయుల్ని స్వయంగా కలిశారా ?
జ) అవును కలిశాను. అందరినీ వదిలేసి వాళ్ళు ఎలా కష్టపడుతున్నది చూశాను. అలాగే ఇండియాలో వాళ్ళ కుటుంబాలని కూడా కలిశాం. వాళ్ళు కూడా తమవారు దూరంగా కష్టాల్లో ఉండటంతో భాదలు పడుతున్నారు.

ప్ర) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో నాపేరు లక్ష్మి. పని కోసం గల్ఫ్ వెళ్తాను. ఏమీ తెలియని ఆ ప్రాంతంలో నేను ఎలాంటి కష్టాలు అనుభవించాను, మధ్యలో ప్రేమలో ఎలా పడ్డాను అనేదే నా పాత్ర. మంచి లవ్ ట్రాక్ ఉంటుంది. చూసే ప్రతి ఒక్కరికీ కనెక్టవుతుంది.

ప్ర) ఈ సినిమా మీకు ఎలాంటి గుర్తింపునిస్తుందనుకుంటున్నారు ?
జ) నాకు స్టార్ ఇమేజ్ అవసరంలేదు. నా నటన అందరికీ నచ్చితే చాలు. చాలా మంది ఆరంభంలోనే డీగ్లామర్ రోల్స్ ఎందుకు అన్నారు. కానీ ఈ పాత్రలో నటించడానికి స్కోప్ ఉంది. మంచి కథ ఉంది. అందుకే చేశాను. ఈ సినిమాతో నాకు మంచి నటి అనే గుర్తింపు వస్తుందని నమ్ముతున్నాను.

ప్ర) కొత్త సినిమా ఆఫర్లు ఏమైనా వచ్చాయా ?
జ) కథలు వస్తున్నాయి. వింటున్నాను. ఇంకా వేటినీ ఓకే చేయలేదు. కొత్తగా, భిన్నంగా, ఇప్పటి కాలానికి తగినట్టు ఉండే సినిమాలు చేయాలని ఉంది. ఈ సినిమా రిజల్ట్ తర్వాత కొత్త వాటికి సైన్ చేస్తాను.

ప్ర) డైరెక్టర్ సునీల్ రెడ్డిగారితో వర్క్ ఎలా ఉంది ?
జ) అయన నన్ను ఒక తండ్రిలా చూసుకున్నారు. ఈ అఫర్ వచ్చే సమయానికి నాకు 17 ఏళ్ళు. ఆ వయసులో గల్ఫ్ వెళ్లడానికి అనుమతిలేదు. కానీ సునీల్ రెడ్డిగారు నాకోసం 2 ఇయర్స్ వెయిట్ చేసి నేను మేజర్ అయ్యాక సినిమా స్టార్ట్ చేశారు. ఆయనతో వర్క్ చేయడం, ఈ సినిమాలో భాగమవడం నిజంగా నా అదృష్టం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు