తన పారితోషికాన్ని పెంచిన హన్సిక

తన పారితోషికాన్ని పెంచిన హన్సిక

Published on Dec 18, 2014 7:17 PM IST

Hansika
జూనియర్ కుష్బూగా తమిళనాడులో ఎనలేని మన్ననలను అందుకుంటున్న హన్సిక తన తాజా చిత్రం ‘అర్నమనై’తో మరింత పాపులర్ అయిపొయింది

అయితే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న సామెతను ఈ భామ తు.చ తప్పకుండా ఫాలో అయిపోతుందని, ఈ క్రేజ్ ఉన్నప్పుడే రెమ్యునరేషన్ పెంచాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఒక సినిమాకు ఇప్పుడు హన్సిక రెండు కోట్లు అడుగుతుందట. తెలుగులో సైతం ఈ ఏడాది హన్సికకు ‘పవర్’ రూపంలో మంచి హిట్ వచ్చింది

ప్రస్తుతం విశాల్ సరసన ‘అంబాల’ చిత్రంలో నటిస్తుంది. మరికొన్ని తెలుగు ప్రాజెక్ట్ లకు కూడా సంతకం చేసే దశలో వున్నట్టు సమాచారం

సంబంధిత సమాచారం

తాజా వార్తలు