కత్తి తిప్పడంలో ప్రావీణ్యం సంపాదిస్తున్న హన్సిక

కత్తి తిప్పడంలో ప్రావీణ్యం సంపాదిస్తున్న హన్సిక

Published on Jan 30, 2015 12:59 AM IST

Hansika
అందాల భామ హన్సికకి దక్షిణాది ఫాలోయింగ్ వుంది. తమిళంలో ఈ బొద్దుగుమ్మకి వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ భామ తమిళ సూపర్ స్టార్ విజయ్, శృతిహాసన్ మరియు శ్రీదేవిలతో కలిసి ‘పులి’ షూటింగ్ లో పాల్గుంటుంది. తాజా సమాచారం ప్రకారం హాంకాంగ్ నుండి ఖడ్గవిద్యలో ప్రావీణ్యం పొందిన వారిదగ్గర నుండి హన్సిక శిక్షణ తీసుకుంటుంది.

ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎంత శ్రద్ధగా శిక్షణ తీసుకుంటుంది, మొదటి సెషన్ పూర్తయ్యేసరికి చిన్న చిన్న గాయాలతో ఎంతమేరకు విద్యనేర్చుకుంది వంటి ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. హన్సిక ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదించగానే ఈ సినిమా దర్శకుడు చింబు దేవన్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు