త్వరలో వృద్దాశ్రమం ఏర్పాటు చేస్తా – హన్సిక

త్వరలో వృద్దాశ్రమం ఏర్పాటు చేస్తా – హన్సిక

Published on Jul 25, 2014 1:00 AM IST

hansika-motwani
హీరోయిన్ల కెరీర్ టైం చాలా తక్కువ ఉంటుంది. తమకు ఫేం, క్రేజ్ ఉన్నప్పుడే వీలైనన్ని సినిమాలు చేసి డబ్బులు సంపాదించాలి అనే ఆలోచిస్తారు కొందరు హీరోయిన్లు. మరికొందరు సమాజానికి తమవంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. రెండవ కేటగిరీకి చెందుతారు హన్సిక. ఇప్పటికే హన్సిక కొందరు అనాధ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్నారు.

తాజాగా వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని తన మనసులో మాట బయటపెట్టారు హన్సిక. తమ పిల్లలు ఉన్నత శిఖరాలు చేరడం కోసం అహర్నిశలు శ్రమించిన తల్లిదండ్రులు.. చివరికి నిరాదరణకు గురవుతున్నారు. జీవితంలో సెటిల్ అయిన తర్వాత కన్నవాళ్ళను మర్చిపోతున్నారు. అటువంటి వారి కోసం వృద్దాశ్రమం ఏర్పాటు చేయాలనీ అనుకుంటున్నాను. ఇది నా చిరకాల కోరిక. మా పేరెంట్స్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా.. త్వరలో వృద్దాశ్రమం ఏర్పాటు చేస్తా అని హన్సిక అన్నారు. హన్సిక మంచి మనసును పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు