దీపావళికి స్పెషల్ ప్లాన్ వేసిన హన్సిక.

దీపావళికి స్పెషల్ ప్లాన్ వేసిన హన్సిక.

Published on Oct 20, 2014 7:00 PM IST

Hansika
మరో మూడు రోజుల్లో రానున్న దీపావళికి హన్సిక స్పెషల్ ప్లాన్ వేసింది. తన ప్రతి పుట్టిన రోజుకు కొందరు పిల్లలను హన్సిక దత్తత తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ దీపావళిని ముంబైలో తన ఇంట్లో ఆ 30 మంది పిల్లలతో కలసి సెలెబ్రేట్ చేసుకోనుంది. తన జీవితంలో ఎంతో సంతోషకరమైన ప్రతి పుట్టిన రోజు నాడు హన్సిక వీరి మధ్య గడుపుతుంది.

ప్రస్తుతం హన్సిక నటించిన 2 తమిళ సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. మరో 4 సినిమాల షూటింగ్ జరుగుతుంది. 2 సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. తెలుగులో ఈ అమ్మడు నటించిన చివరి సినిమా ‘పవర్’ హిట్టయ్యింది. వరుస తమిళ సినిమా అవకాశాలతో మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేకపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు