‘అఖిల్’ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ‘హను రాఘవపూడి’
Published on Jul 28, 2016 9:21 pm IST

Hanu_Raghavapudi1
‘అఖిల్’ సినిమాతో వెండి తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు ‘అఖిల్’ మొదటి సినిమా రిలీఈజై ఇన్నాళ్లయినా రెండవ సినిమా ఎప్పుడో చెప్పలేదని అందరూ అనుకున్నారు. ఒకరకంగా అక్కినేని అభిమానులైతే కాస్త అసహనానికి గురయ్యారు కూడ. దీంతో అఖిల్ నిన్న తన రెండవ సినిమా దర్శకుడు ‘హను రాఘపూడి’ అని ప్రకటించేశాడు. కానీ ప్రాజెక్ట్ పొజిషన్ ఏమిటనేది చెప్పలేదు. దీంతో అభిమానుల్లో ఎప్పుడు, కథేమిటి, ఎంతవరకూ వచ్చింది అనే సందేహాలు మొదలయ్యాయి.

వాటికి కొంతవరకూ సమాధానమిస్తూ దర్శకుడు ‘హను రాఘవపూడి’ అఖిల్ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వరకు మొత్తం పక్కాగా పూర్తయిందని, షూటింగ్ మొదలుపెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని ట్విట్టర్ లో తెలిపాడు. హను గతంలో అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాఢ వంటి సినిమాల్ని భిన్నమైన ప్రేమ కథల్ని తెరకెక్కించాడు. వాటిలానే అఖిల్ సినిమా కూడా భిన్నమైన ప్రేమకథ అయ్యుంటుందని తెలుస్తోంది.

 
Like us on Facebook