సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ చిరుకిజన్మదినశుభాకాంక్షలు

సిల్వర్ స్క్రీన్ మెగాస్టార్ చిరుకిజన్మదినశుభాకాంక్షలు

Published on Aug 22, 2014 8:35 AM IST

Chiranjeevi-(11)

ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోస్ లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. నేడు ఆయన 59వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. మూడు దశాబ్దాలు తెలుగులో హీరోగా కొనసాగి ఎన్నో టాప్ గ్రాసర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న చిరంజీవి ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1955లో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోజన్మించిన చిరంజీవి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మొదట్లో ఓ చిన్న ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి టాప్ హీరోగా ఎదిగాడు. ఆయన 80లలో చేసిన సినిమాల్లో తన డాన్సులతో, ఫైట్స్ తో విపరీతంగా ఆకట్టుకొని ఫ్యాన్ ఫాలోయింగ్ ని అమాంతం పెంచేసుకున్నారు.

2006 లో చిరంజీవికి గవర్నమెంట్ అఫ్ ఇండియా పద్మ భూషణ్ ఇచ్చి సత్కరించింది. అదే సంవత్సరంలో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది. ఇప్పటి వరకు 149 సినిమాలు చేసిన చిరంజీవి 5 సార్లు నంది అవార్డ్స్ అందుకున్నారు. గత 7 సంవత్సరాలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటూ సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఎట్టకేలకు అభిమానుల కోరిక మేరకు మళ్ళీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందులో భాగంగా చిరు విడుదల చేసిన ఫోటో షూట్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. చిరు ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 150వ సినిమాని చిరు త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్ళే పనిలో ఉన్నాడు. తన 150వ సినిమా విశేషాలను తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు అనౌన్స్ చేయనున్నారు. కామెడీ విత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్న చిరు 150వ సినిమాని చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు.

బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్ అని దూసుకొస్తున్న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 123తెలుగు.కామ్ తరపున ఆయనకిజన్మదినశుభాకాంక్షలుతెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు