హ్యాపీ బర్త్ డే టు మంచు విష్ణు.!

హ్యాపీ బర్త్ డే టు మంచు విష్ణు.!

Published on Nov 23, 2014 11:26 AM IST

manchu-vishnu
‘వందనం వందనం మీరే నా జీవితం’ అంటూ ‘విష్ణు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో మంచు విష్ణు. కలెక్షన్ కింగ్ డా. కింగ్ మోహన్ బాబు వారసుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు తక్కువ టైంలో తన కంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచున్నాడు. ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు.. 1981 నవంబర్ 23న జన్మించిన మంచు విష్ణు తన 22వ ఏట విష్ణు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

2007లో వచ్చిన ‘డీ’ సినిమాతో మొదటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ అందుకున్న విష్ణు ఆ తర్వాత వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ విజయాలను అంటుకున్నాడు. ఒక్క హీరోగానే కాకుండా 2010 లో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్ పై కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. 2014లో మంచు విష్ణు 4 సినిమాలను రిలీజ్ చేసాడు. ప్రస్తుతం దేవకట్టా డైరెక్షన్ లో చేయనున్న సినిమా కోసం సిద్దమవుతున్నాడు.

ఇలానే వరుసగా సినిమాలు చేస్తూ మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటూ మంచు విష్ణు పుట్టిన రోజు సందర్భంగా విష్ణుకి 123తెలుగు.కామ్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు