కొత్త రికార్డులను సృష్టిస్తున్న హ్యాపీ న్యూ ఇయర్

కొత్త రికార్డులను సృష్టిస్తున్న హ్యాపీ న్యూ ఇయర్

Published on Oct 25, 2014 10:10 AM IST

happy-new-year
ముందుగా ఊహించినట్టుగానే షారుఖ్ ఖాన్ నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా మొదటిరోజు రికార్డు కలెక్షన్లను సాధించింది. కేవలం ఒక్కరోజులోనే ఈ చిత్రం 44కోట్లను వసూలు చేసింది. ఒక భారతీయ చిత్రం ఇంత అత్యధిక మొత్తంలో కలెక్ట్ చెయ్యడం ఇదే తొలిసారి. ఈ సినిమా తెలుగు వెర్షన్ 2కోట్లను, తమిళ వెర్షన్ 94లక్షల వసూళ్ళను సాధించింది.

ఈ సినిమాను ఫరాఖాన్ దర్శకత్వం వహించింది. షారుఖ్, అబిషేక్ బచ్చన్, దీపికా పదుకునే తదితరులు నటించారు. ఈ సినిమా విడుదలైన ప్రతీచోటా హౌస్ ఫుల్ కలెక్షన్లతో 200కోట్ల మార్కుకి దగ్గరవుతుంది

సంబంధిత సమాచారం

తాజా వార్తలు