‘నువ్వే నువ్వే’ తరహా ఫీల్ లో రామ్ ‘హరికథ’

‘నువ్వే నువ్వే’ తరహా ఫీల్ లో రామ్ ‘హరికథ’

Published on Oct 4, 2015 5:52 PM IST

ram-harikatha
‘పండగ చేస్కో’ సినిమాతో హిట్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ మూడు రోజుల క్రితం శివమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి వీకెండ్ బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. శ్రీనివాస్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చేసిన శివమ్ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా కనిపించింది. ఇదిలా ఉంటె రామ్ తన తదుపరి సినిమా ‘హరికథ’ కూడా సెట్ పై ఉంది. సెట్స్ పై ఉండడమే కాదు ఇప్పటికే సగభాగంపైనే షూటింగ్ పూర్తయ్యింది.

తండ్రి – కుమార్తెల మధ్య ప్రేమాను బంధాలకి పెద్దపీట వేస్తూ చేసిన హరికథ సినిమాలో 2002లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన నువ్వే నువ్వే సినిమా చాయలు కనిపిస్తాయని నిర్మాత స్రవంతి రవికిషోర్ తెలిపాడు. ఈ హరికథ సినిమాని నవంబర్ కల్లా పూర్తి చేసి డిసెంబర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు