కళ్యాణ్ రామ్, హరికృష్ణ కలిసి నటించబోతున్నారు !

కళ్యాణ్ రామ్, హరికృష్ణ కలిసి నటించబోతున్నారు !

Published on Mar 20, 2018 11:10 PM IST

పవన్ సాదినేని దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హరికృష్ణ కళ్యాణ్ రామ్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. తండ్రి కొడుకులు తెరపై కూడా ఫాదర్ అండ్ సన్ పాత్రల్లో కనిపించబోతుండడం విశేషం.త్వరలో మొదలు కానున్న ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

స్క్రిప్ట్ నచ్చడంతో కళ్యాణ్ రామ్ సొంతంగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకేక్కిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ నటించిన తాజా సినిమా ఎంఎల్ఎ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తరువాత మే లో నా నువ్వే సినిమా రానుంది. ఆ తరువాత విరించి వర్మ సినిమా పవన్ సాదినేని మూవీ ఒకేసారి చెయ్యబోతున్నాడు ఈ హీరో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు