నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో క్లూ ఇచ్చిన హరీష్ శంకర్ !
Published on Jul 2, 2017 7:22 pm IST


ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ మొత్తం హరీష్ శంకర్ పేరుతో మారుమోగిపోతోంది. అందుకు కారణం తాజాగా అల్లు అర్జున్ హీరోగా అయన డైరెక్ట్ చేసిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం. నెగెటివ్ పబ్లిసిటీ నైపథ్యంలో కూడా అన్ని అడ్డంకులను దాటుకుని ఈ సినిమా మొదటి వారంలోనే రూ.100కోట్ల గ్రాస్ ను వసూలు చేసి భారీ హిట్ గా నిలిచింది. దీంతో హరీష్ శంకర్ చేయబోయే తర్వాతి సినిమా ఎలా ఉంటుందో చూడాలని అందరిలోనూ ఆసక్తి రేగింది.

ప్రస్తుతం యూఎస్ లో చిత్ర సభ్యులతో పాటు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న హరీష్ శంకర్ తన తర్వాతి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఉంటుందని, ఆ కాన్సెప్ట్ కూడా బలమైన భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ జానర్లో ఉంటుందని అన్నారు. అయితే ఇంకా పూర్తి కథ రాయలేదని, హీరో హీరోయిన్లు ఎవరో కూడా అనుకోలేదని, కథే నటీ నటుల్ని ఎంచుకుంటుందని చెప్పుకొచ్చారు.

 
Like us on Facebook