మెగా మేనల్లుడితో హరీష్ శంకర్ మూవీ ఓపెనింగ్ ఆ రోజేనా..?

మెగా మేనల్లుడితో హరీష్ శంకర్ మూవీ ఓపెనింగ్ ఆ రోజేనా..?

Published on Oct 30, 2014 10:35 PM IST

Harish-Shankar-Directs-Sai-
‘గబ్బర్ సింగ్’ విజయం తర్వాత మరోసారి మెగా హీరోని డైరెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు హరీష్ శంకర్. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా రూపొందించడానికి హరీష్ శంకర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. నవంబర్ మొదటివారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుగుతుందని సమాచారం. నవంబర్ 3వ తేది ఫిక్స్ చేశారని టాక్. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందట.

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా నవంబర్ 14న విడుదలవుతుంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు ఈ కొత్త సినిమాను నిర్మిస్తున్నారు. ‘సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా సినిమా వివరాలను ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు