‘డీజే’ రిజల్ట్స్ పట్ల డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారట !

‘డీజే’ రిజల్ట్స్ పట్ల డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారట !

Published on Jun 23, 2017 6:45 PM IST


అల్లు అర్జున్ తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ భారీ స్థాయిలో ఈరోజే విడుదలయ్యింది. ముందుగా అందరూ అనుకున్నట్టే చిత్రం భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం కనిపిస్తోంది. ముందు నుండి సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఉన్న ఉత్సుకత, బన్నీ ఫాలోయింగ్ ఈ స్థాయి ఓపెనింగ్స్ కు బాగా దోహదపడ్డాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి ఆక్యుపెన్సీ దొరికినట్టు సమాచారం.

అంతేగాక మొదటి షోల తర్వాత ప్రధాన ఏరియాల నుండి వస్తున్న టాక్ పట్ల డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉన్నారని, సినిమా బన్నీ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలుస్తుందని దర్శకుడు హరీశ్ శంకర్ నమ్మకంగా చెబుతున్నారు. ఇకపోతే రాబోయే రెండు రోజులు శనివారం, ఆదివారం సెలవులు కావడంతో కలెక్షన్లు మరింతగా ఊపందుకునే ఛాన్సుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు