ఆ విషయం తెలియాలంటే సినిమా విడుదల వరుకు ఆగాల్సిందే !

ఆ విషయం తెలియాలంటే సినిమా విడుదల వరుకు ఆగాల్సిందే !

Published on Jan 21, 2018 12:09 AM IST

రామ్ చరణ్ ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ద్వారా మంచి లవ్ స్టోరి చెప్పబోతున్నాడు దర్శకుడు సుకుమార్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిస్తాత్మకంగా నిర్మిస్తున్నారు. అనసూయ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాలో అనసూయ చరణ్ అత్తపాత్రలో కనిపించాబోతుందని వార్తలు వచ్చాయి. కాని ఈ మద్య ట్విట్టర్ లో అనసూయ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను చరణ్ కు అత్తా పాత్రలో నటిస్తున్నాను అని వచ్చిన వార్తలో నిజం లేదని వెల్లడించింది. ఆమె రంగస్థలం సినిమాలో ఒక మంచి పాత్ర చేస్తుంది అన్నది నిజం కాని ఏ పాత్ర చేస్తుంది ఎలా ఉండబోతోందో తెలియాలలంటే సినిమా విడుదల వరుకు ఆగాల్సిందే..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు