ఆసక్తి రేపుతున్న ఏ (ఏ డి ఇన్ఫినిటమ్) టీజర్

ఆసక్తి రేపుతున్న ఏ (ఏ డి ఇన్ఫినిటమ్) టీజర్

Published on Jun 5, 2020 12:27 PM IST

నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం ఏ (ఏ డి ఇన్ఫినిటమ్). ఓ విభిన్నమైన కాన్సెప్ట్ తో సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమాపై ఆసక్తి పెంచిన చిత్ర బృందం ఆసక్తికర టీజర్ తో ముందుకు వచ్చారు. నేడు ఏ (ఏ డి ఇన్ఫినిటమ్) చిత్ర టీజర్ విడుదలయ్యింది.

ఓ హ్యాపీ ఫ్యామిలి లో బాలిక మిస్సింగ్, కలకలం రేపుతోంది. ఆ బాలిక మిస్సింగ్ వెనుక ఉన్న రహస్యం ఏమిటీ అనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. మొత్తంగా సస్పెన్సు ఎలిమెంట్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ చిత్రానికి యుగంధర్ దర్శకత్వం వహించగా, విజయ్ కూరాకు సంగీతం అందిస్తున్నాడు. అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు