లాల్ సింగ్ చద్దా గా అమీర్ నయా లుక్

లాల్ సింగ్ చద్దా గా అమీర్ నయా లుక్

Published on Nov 18, 2019 12:23 PM IST

విలక్షణ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ ఉంటారు హీరో అమీర్ ఖాన్. 3 ఇడియట్స్, పీకే, దంగల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కాగా అమీర్ మరో ప్రయోగాత్మక చిత్రానికి సిద్ధమయ్యారు. లాల్ సింగ్ చద్దా పేరుతో తెరకెక్కనున్న ఈచిత్రంలో ఫీజికల్లీ మరియు మెంటల్లీ పాక్షికమైన లోపాలు కలిగిన వ్యక్తిగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో అమీర్ సైనికుడిగా చేస్తున్నారు. ఈ మూవీ 1994 టామ్ హంక్స్ హీరోగా వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’ అనే హాలీవుడ్ చిత్రానికి అనువాదం.

ఆ మూవీ కథను స్ఫూర్తిగా తీసుకొని ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు విడుదలైంది. పెరిగిన గడ్డం, లైట్ పింక్ కలర్ చెక్స్ షర్ట్ లో సింగ్ గెటప్లో అమీర్ లుక్ ఆసక్తికరంగా ఉంది. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్, కిరణ్ రావ్, వియాకామ్ 18 స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా లాల్ సింగ్ చద్దా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు