అల్లు శిరీష్ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్..!

అల్లు శిరీష్ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్..!

Published on Feb 14, 2016 11:42 AM IST

sreerasthu-m
‘గౌరవం’ సినిమాతో మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఆ తర్వాత ‘కొత్త జంట’ సినిమాతో మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన మూడో సినిమా కోసం కొంతకాలం గ్యాప్ తీసుకొని, ప్రస్తుతం దర్శకుడు పరశురాంతో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నారు. ‘యువత’, ‘ఆంజనేయులు’, ‘సోలో’ సినిమాలతో మెప్పించిన పరశురామ్, ‘సారొచ్చారు’ ఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలని శిరీష్‌తో ఓ బలమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ చివరిదశకు చేరిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ ఉదయం ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు. ఈ ఫశ్ట్‌లుక్‌తోనే సినిమా టైటిల్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమాకు ‘శ్రీరస్తు శుభమస్తు’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. గత కొద్దికాలంగా తెలుగులో అచ్చ తెలుగు టైటిల్స్‌కు మంచి ఆదరణ కనిపిస్తోన్న నేపథ్యంలో శిరీష్ సినిమాకు ‘శ్రీరస్తు శుభమస్తు’ అన్న టైటిల్ ఆ కోవలోనే ఆసక్తికరంగా ఉంది. అల్లు శిరీష్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు