ఆ దర్శకుడితో అల్లరి నరేష్ కొత్త సినిమా !

ఆ దర్శకుడితో అల్లరి నరేష్ కొత్త సినిమా !

Published on Oct 20, 2017 4:15 PM IST


‘అల్లరి’ చిత్రంతో కెరీర్ ప్రారంభించి, హీరోగా 50 చిత్రాలు పూర్తిచేసుకున్నాడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ అంటే మినిమం గ్యారెంటి హీరో, ఈమధ్య వరుసగా సినిమాల్లో నటిస్తున్నా ఈ హీరోకు ఆశించిన స్థాయిలో విజయం అందడం లేదు. తాజాగా ‘మేడమీద అబ్బాయి’ చిత్రంలో నటించాడు ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు మంచి హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు నరేష్. తాజాగా ఓ క్రేజీ సినిమాలో నటించేందుకు సిద్దమయ్యాడు.

ప్రముఖ దర్శకుడు సత్తి బాబు ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు. రామ ఫిలిమ్స్ సమర్పణలో సుదీర్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ వారు మంచు విష్ణు తో ‘ఓటర్’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ ‘ఓటర్’ సినిమా త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు