రౌడీ హీరో తమ్ముడు కొత్త మూవీ ప్రకటించాడు

రౌడీ హీరో తమ్ముడు కొత్త మూవీ ప్రకటించాడు

Published on Jul 10, 2020 12:35 PM IST

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది విడుదలైన ట్రాజిక్ పీరియాడిక్ లవ్ డ్రామా దొరసాని మూవీలో ఆనంద్ దేవరకొండ నటించారు. ఆ మూవీతో హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా వెండితెరకు పరిచయం కావడం విశేషం. ఆ చిత్ర ఫలితం ఎలా ఉన్నా ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ యంగ్ ఫెలో ఓ కొత్త మూవీ ప్రకటించారు.

టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాలు నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఆనంద్ దేవరకొండతో మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన నేడు వెలువడింది. వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బిగిల్ ఫేమ్ వర్ష బొల్లమ్మ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు