నాయకుడిని ప్రశ్నించడానికి వస్తోన్న హీరో !

మంచు విష్ణు తాజా చిత్రం ‘ఓటర్’ జి.ఎస్. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా, రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ కుమార్ పూదోట ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. సురభి హీరొయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది. “ప్రజా స్వామ్యంలో అత్యంత కీలకమైన పాత్ర ఓటర్ దే, కానీ అటువంటి ఓటర్ ఎన్నికల తర్వాత నిర్లక్ష్యానికి గురవుతున్నాడు. ఓటర్ నిజమైన శక్తీగలవాడు. ప్రశ్నించే తత్వం ఓటర్ కు ఉంది. ఎన్నికలు పూర్తి అయ్యాక ఓటర్ ను మరచిపోతున్నాడు నాయకుడు. ఈ అంశంపై సినిమా తెరకేక్కిస్తున్నాడు దర్శకుడు కార్తీక్ రెడ్డి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Like us on Facebook