రామ్ తో బాలయ్య డైరెక్టర్ ఫిక్సా ?

రామ్ తో బాలయ్య డైరెక్టర్ ఫిక్సా ?

Published on Feb 27, 2021 2:30 PM IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి నట సింహం బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నాడు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత సినిమా ఏమిటి ? కాగా తాజాగా తన తరువాత సినిమాని హీరో రామ్ తో చేస్తున్నాడని ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

కానీ బోయపాటి శ్రీను తరువాత సినిమా పై ఇప్పటికే అనేక రకాలుగా చాల రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఇక బాలయ్యతో చేస్తోన్న సినిమా ఫుల్ యాక్షన్ తో పాటు ఎమోషనల్ గానూ ఉంటుందట. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. బాలయ్య కూడా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు