డిఫరెంట్ వ్యాధితో కనిపించబోతున్న యువ హీరో !

డిఫరెంట్ వ్యాధితో కనిపించబోతున్న యువ హీరో !

Published on Mar 18, 2018 1:27 PM IST

యువహీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. మే 11న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రటించారు. ఉగాది సందర్భంగా ఈరోజు రాజుగాడు టీజర్ ను విడుదల చేసారు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ తో ఆకట్టుకుంటున్న రాజ్‌ తరుణ్ ఈ సినిమాలో క్లెప్టోమేనియాతో వ్యాధితో ఇబ్బంది పడే అబ్బాయి పాత్రలో కనిపించబోతున్నాడు. టీజర్ లో తనకు తెలీకుండానే దొంగతనాలు చేస్తూ దర్శనమిచ్చాడు ఈ హీరో.

అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో హీరో పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో రాజ్ తరుణ్, రాజేంద్ర ప్రసాద్ నటించిన ఈడోరకంఆడోరకం సినిమా మంచి విజయం సాధించింది. ఏ.కె. ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కామెడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు