అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపితే మా మిస్టర్ అండ్ మిస్ – హీరో సన్నీ

అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపితే మా మిస్టర్ అండ్ మిస్ – హీరో సన్నీ

Published on Jan 20, 2021 4:00 PM IST

షార్ట్ ఫిలింస్ తో ఆకట్టుకున్న నోటెడ్ నటుడు సన్నీ శైలేష్ హీరోగా జ్ఞానేశ్వరి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “మిస్టర్ అండ్ మిస్”. అయితే ఇదే పేరుతో ముందుగా షార్ట్ ఫిలిం తోనే పలకరించి ఇప్పుడు దానిని సినిమా స్థాయిలో రెడీ చేసి విడుదలకు రెడీ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఈ సినిమా హీరో సన్నీ కొన్ని ఆసక్తికర విషయాలనే లేటెస్ట్ ఇంటర్వ్యూ ద్వారా పంచుకున్నాడు.

తనకి ఇంటర్ నుంచే సినిమాల్లో చాలా ఆసక్తి ఉండేది అని అక్కడ నుంచి షార్ట్ ఫిలిమ్స్ చేస్కుంటూ ఈ షార్ట్ ఫిలిం కూడా చేసానని తెలిపాడు. మరి అలా ఈ సినిమా కార్యరూపం దాల్చిందని చెప్పాడు. మరి అలాగే తమ సినిమా ఖచ్చితంగా యూత్ ను బాగా ఆకట్టుకునేలా మాత్రమే కాకుండా పెద్దలకు కూడా మేము చెప్పే పాయింట్ “అరె ఇది నిజమే కదా” అనిపించేలా చేస్తుంది అని తెలిపాడు.

మరి అలాగే ఈ సినిమా అంతటిని తమ దర్శకుడు అశోక్ రెడ్డినే తన భుజాలపై మోసాడని అన్నాడు. మరి తమ సినిమాలో అన్ని కమర్షియల్ పాయింట్స్ ఖచ్చితంగా ఉంటాయని మరి అవన్నీ కలిపితేనే మా “మిస్టర్ అండ్ మిస్” సినిమా అని ధీమా వ్యక్తం చేసాడు. మరి ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం అందివ్వగా రీడింగ్ లాంప్ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు