వేశ్య పాత్రకే గ్లామర్ అద్దుతున్న హీరోయిన్ !

వేశ్య పాత్రకే గ్లామర్ అద్దుతున్న హీరోయిన్ !

Published on Feb 20, 2020 5:36 PM IST

హీరోయిన్ ‘శ్రద్దా దాస్’ గ్లామర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమ్మడుకి నటన రాకపోయినా.. అందాలు పదర్శించడంలో మాత్రం బాగానే కష్టపడుతుంది. అయితే ఫొటో షూట్స్ తో అందాల డోస్ పెంచినా ఈ బ్యూటీకి ఉపయోగం మాత్రం లేకుండా పోతుంది. పెద్దగా అవకాశాలు రావడం లేదు. ‘ఆర్య 2, డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ’ లాంటి హిట్ సినిమాల్లో కనిపించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పటికీ… తెలుగులో ఓ సూపర్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. అందుకేనేమో కాస్త అడల్ట్ పాత్రల్లో నటించి అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

ప్రముఖ కొరియోగ్రఫర విద్యాసాగర్ దర్శకుడిగా మారి ఒక సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. జగపతిబాబు ప్రధాన పాత్రగా వస్తోన్న ఈ సినిమాలో శ్రద్దా దాస్ ఒక వేశ్య పాత్రలో నటిస్తోందట. కథ ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ‘శ్రద్దా దాస్’ పాత్ర బాగా బోల్డ్ గా ఉంటుందని.. ముద్దు సీన్స్ కాస్త ఘాటుగానే ఉంటాయని తెలుస్తోంది. అయితే ఎలాంటి బోల్డ్ సీన్స్ లోనైనా ‘శ్రద్దా దాస్’ చాల ఈజీగా నటించేస్తోందట. ఒక విధంగా వేశ్య పాత్రకే కొత్త గ్లామర్ అద్దుతున్న అందుతుందట. మరి ఈ సారైనా ‘శ్రద్దా దాస్’కి హిట్ వచ్చి స్టార్ డమ్ తో పాటు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు