పెళ్లికి సిద్దమవుతున్న ఆ హీరోయిన్ ఎవరు ?

swathi
మాటీవీ ‘కలర్స్’ ప్రోగ్రామ్ తో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై డేంజర్ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ‘కలర్స్ స్వాతి’. అష్టా చెమ్మా, స్వామిరారా, గోల్కొండ హైస్కూల్, కార్తికేయ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె కు ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమా ఆఫర్లేమీ లేవు. అటు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవు. దీంతో ఈమె పెళ్ళికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈమె వయసు 29 ఏళ్ళు. అందుకే తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయాలని చూస్తున్నారట. కానీ ఈమె ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా లేకపోతే బయటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందా అనేది ఇంకా తెలియలేదు. ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. తండ్రి నేవీ అధికారి కావడంతో స్వాతి రష్యాలో పుట్టింది. నటనపై ఉన్న మక్కువతో సినిమా రంగంవైపు అడుగులు వేసి నటిగా స్థిరపడింది.

 

Like us on Facebook