బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరంటే…?

బాలకృష్ణ సినిమాలో హీరోయిన్ ఎవరంటే…?

Published on May 28, 2016 12:47 PM IST

gautamiputrasatakarni
నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీ పుత్రశాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తన తొలి షెడ్యూల్ లో దాదాపు నలభై రోజుల పాటు మొరాకోలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెందవ షెడ్యూల్‌కు సమాయత్తం అవుతున్నది.

ఇప్పుడు ఈ సినిమా చిత్రబృందాన్ని ఓ సమస్య వేధిస్తున్నది. అదేమిటంటే… ఈ సినిమా హీరోయిన్ విషయం పై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా నయనతారను తీసుకోవాలని భావించినా ఆమె డేట్స్ కుదరకపోవటంతో ప్రస్తుతం హీరోయిన్ ని వెదికే పనిలో పడ్దారు. మరో వారం రోజుల్లో హీరోయిన్ ని ఎంపిక చేసి రెండో షెడ్యూల్ ని ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు స్వంత బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ’మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేం వి.యస్. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కి సినిమా విడుదల చేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు