రామ్‌కు జోడీగా నటించబోయేది ఆ ఇద్దరేనా ?

రామ్‌కు జోడీగా నటించబోయేది ఆ ఇద్దరేనా ?

Published on Oct 18, 2019 12:01 AM IST

ఇటీవలే ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న హీరో రామ్ తన తర్వాతి సినిమాను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా తమిళ హిట్ మూవీ ‘తడం’ను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆ పనులు మొదలయ్యాయి. నవంబర్ 2వ వారంలో సినిమా లాంఛ్ కానుంది.

కాస్ట్ అండ్ క్రూ కూడా ఫైనల్ అయ్యారట. కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండాలి. ఆ ఇద్దరినీ ఫైనల్ చేశారట. వారిలో ఒకరు నివేత పేతురాజ్ కాగా ఇంకొకరు ‘నేల టికెట్’ ఫేమ్ మాళవిక శర్మ అని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర బృందం నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయనున్నాడు. గతంలో ఈయన ‘నేను శైలజ’తో రామ్‌కు మంచి విజయాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు