పవన్ ఛాన్స్ ఇచ్చేసరికి ఆనందంతో పొంగిపోతున్న హీరోయిన్లు !

పవన్ ఛాన్స్ ఇచ్చేసరికి ఆనందంతో పొంగిపోతున్న హీరోయిన్లు !

Published on Dec 3, 2016 5:56 PM IST

keethi-suresh-anu-ennumula
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో సినిమా అనగానే సగం విజయం ఖాయం అయిపోయినట్టే అనేది ప్రేక్షకుల, సినీ వర్గాల్లో వినిపించే మాటైతే సినిమా ఎలా ఉన్నా మినిమమ్ హిట్ అనేది అభిమానుల మాట. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ప్రాజెక్టులో పవన్ సరసన, త్రివిక్రమ్ డైరెక్షన్లో నటించడానికి చాలా మంది స్టార్ హీరోయిన్లు సిద్ధంగా ఉంటారు. సినీ జనాలు కూడా త్రివిక్రమ్, పవన్ లు ఏ స్టార్ హీరోయిన్ ని సెలెక్ట్ చేస్తారా అని ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ వీరిద్దరూ మాత్రం ఎవరి ఊహకు అందని విధంగా హీరోయిన్లను డిసైడ్ చేశారు.

తెలుగు స్టార్ హీరోయిన్ల జోలికి పోకుండా మొదటి హీరోయిన్ గా తమిళ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ని రెండో హీరోయిన్ గా కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన కొత్త హీరోయిన్ అను ఇమ్మాన్యుల్ ను సెలెక్ట్ చేశారు. దీంతో అందరితో పాటు ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. ముఖ్యంగా రెండో హీరోయిన్ అను ఇమ్మాన్యుల్ అయితే చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా ఉందని,ఎప్పుడెప్పుడు ఆయనతో షూటింగ్ మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నానని పట్టలేని ఆనందాన్ని తెలియపరిచింది. ఇక కీర్తి సురేష్ తాజాగా జరిచిన ‘రెమో’ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ నా నెక్స్ట్ సినిమా పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ సినిమా 2017 జనవరి ఆఖరులో మొదలై జూలై నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు